రోడ్డు ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తుని వాసి అప్పలరాజు (46) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. తేటగుంట సమీపంలోని బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీ కొని వెనుక కూర్చున్న అప్పలరాజు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని ఈ నెల 5న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. సోమవారం మృతి చెందారన్నారు. దీనిపై తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.