సామర్లకోటలో అఖిలపక్ష సమావేశం
NEWS Sep 17,2024 07:08 am
రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సామర్లకోట మండలంలో పోలింగ్ స్టేషన్ ఖరారు చేసేందుకు సామర్లకోట తహశీల్దార్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో సామర్లకోట తహశీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సామర్లకోట-పిఠాపురం రోడ్డులోని పాత తహశీల్దార్ కార్యాలయం పోలింగ్ స్టేషనుగా ఉపయోగించడం జరిగిందని, ప్రస్తుతం ఆ భవనం శిధిలావస్థకు చేరిందని తెలిపారు.