మంచిర్యాలలో ఘనంగా తెలంగాణ
విమోచన దినోత్సవం వేడుకలు
NEWS Sep 17,2024 07:04 am
మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బీజేపీ కార్యాలయం, అర్చన టెక్స్ చౌరస్తాలో పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.