కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రౌండ్ లో ఉదయం వాకర్స్ అధ్వర్యంలో ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి తుదిశ్వాసకు నమ్మిన సిద్దాంతాన్ని వదలకుండా భారత దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.