జగిత్యాల: జగిత్యాలలోని చైతన్య నగర్లో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ యువకులు మట్టి వినాయకుడి ప్రతిష్ఠించి 9 రోజులపాటు విశిష్ట పూజలు చేశారు. యువకులు వాతావరణం కాలుష్యం కాకుండా ఉండేందుకు వినూత్నఆలోచనతో వినాయక నిమజ్జనానికి రథాన్ని సిద్ధం చేశారు. మట్టి వినాయకుడి అరటి చెట్ల మధ్య ఎడ్ల బండిలో ఏర్పాటు చేశారు. యువకులు అందరూ ఆకుపచ్చని కండువాలు మెడలో వేసుకొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.