డుంబిగుడ: పెదపాడు గ్రామానికి వెళ్లే మెటల్ రోడ్డు కోతకు గురైంది. చాపరాయి గెడ్డ నుంచి పెదపాడు వరకు గత ఏడాది మెటల్ రోడ్డు నిర్మించారు. ఇది జరిగి ఏడాది కాకముందే వర్షాలకు రోడ్డు కొట్టుకుపోవ డంతో గిరిజనులకు రవాణా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నాణ్యతాప్రమాణాలను పాటించకుండా నిర్మాణం జరగడంతోనే రోడ్డు కొట్టుకుపోయిందని గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డును పూర్తిగా మరమ్మతు చేసి రవాణా సదుపాయం కల్పించాలని స్థానిక ప్రజలు కోరారు.