తెలంగాణ సాయుధ పోరాటానికి
నిజమైన వారసులు కమ్యూనిస్టులే
NEWS Sep 17,2024 06:51 am
సిపిఎం ఏరియా కమిటీ అధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభ పటాన్‌చెరు శ్రామిక్ భవన్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య హాజరై మాట్లాడారు. తెలంగాణ రైతాంగసాయుధ పోరాటoలో ప్రాణాలను కమ్యూనిస్టులు బలిదానం చేసి తెలంగాణ ప్రాంతంలో జాగిర్దారులు భూస్వాముల వద్ద ఉన్న లక్షల భూములు లాగి పేదలకు పంచడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో 4,000 మంది ప్రాణాలను బలిదానం చేశారని 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టారన్నారు.