సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం
NEWS Sep 16,2024 08:04 pm
ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లో నూ జాతీయ జెండా ఎగురవేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. నైజాం ప్రజలకు విముక్తి కలిగిన రోజు ను ఎవరికి నచ్చింది వారు చేస్తూ వస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏటా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.