జగిత్యాలలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
NEWS Sep 16,2024 06:39 pm
జగిత్యాల జిల్లాలో డెంగ్యూతో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 250 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు మృతిచెందడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని పీహెచ్సీల పరిధిలోని సిబ్బందికి తక్షణం డెంగీ నిర్ధారణకు 13,200 ర్యాపిడ్ కిట్స్ అందించి పరీక్షలు చేయిస్తున్నారు.