TG: గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రభు త్వం జీవో జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబా లకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియా 2023 డిసెంబర్ 7 తర్వాత మర -ణించిన గల్ఫ్ కార్మికులకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయం కోసం అడ్వయిజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజా వాణిని నిర్వహిస్తారు. గురుకులాల్లో గల్ఫ్ కార్మికు ల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.