వేములవాడలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
NEWS Sep 16,2024 06:10 pm
వేములవాడ పట్టణంలో నిమజ్జన సరళిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. వేములవాడ పట్టణం, వివిధ మండల కేంద్రాల్లో జరుగుతున్న వినాయక నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని విప్ తెలిపారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.