రేపు ప్రజా పాలన దినోత్సవం
NEWS Sep 16,2024 06:08 pm
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ వేడుకను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అధికారులు సోమవారం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.