మౌలిక సౌకర్యాలు కల్పించాలి
NEWS Sep 16,2024 06:07 pm
సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కాలనీని కలెక్టర్ పరిశీలించారు.ఈసందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్మశాన వాటిక కోసం స్థలాన్ని గుర్తించాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ జయంత్ ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.