నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి
NEWS Sep 16,2024 06:06 pm
వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పలు శాఖల అధికారులు పరిశీలించారు. మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని కోరారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.