సౌదీలో తెలుగు పండగకు ఏర్పాట్లు!
NEWS Sep 16,2024 05:43 pm
సౌదీ అరేబియాలో తెలుగు భాషా దినోత్సవం పేరిట ‘సాటా’ నిర్వహించే తెలుగు ప్రవాసీ ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతు న్నాయి. ఈనెల 20న రియాద్ సిటీలోని జరిగే వేడుకలకు గల్ఫ్ ఎన్నారైలు, స్వదేశం నుంచి అనేక కుటుంబాలు వస్తున్నాయని, పిల్లలకు, మహిళల కు ఆద్యంతం వినోద భరిత సాంస్కృతిక కార్యక్ర మాలు ఉంటాయని సాటా నిర్వహకులు ఆనంద రాజు, ముజ్జమ్మీల్, రంజీత్, మల్లేశన్ తెలిపారు.