సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దే చెరువు పక్కన గల పల్లె ప్రకృతి వనంలోని చెట్లను అగంతకులు నరుకుతున్నారు. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా రాష్ట్ర ప్రభుత్వం చెట్లను పెడితే ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెట్ల కొమ్మలు నరికిన వారికి గ్రామపంచాయతీ సిబ్బంది వేల రూపాయలు జరిమానాలు విధిస్తున్నారు. లక్షలు వెచ్చించి పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు పెరిగాయి. సోమవారం ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెట్లను నరికి పల్లె ప్రకృతి వనం ఫినిషింగ్ కంచె బయట వేశారు.