వినాయక యువమిత్ర మండలి
ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం
NEWS Sep 16,2024 06:01 pm
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో శ్రీ వినాయక యువమిత్ర మండలి 29వ వార్షికోత్సవం సందర్భంగా గణేశునికి, సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడూరు ప్రవీణ్, పట్టణ సీఐ కృష్ణ హాజరయ్యారు. శ్రీ వినాయక యువ మిత్ర మండలి సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.