అన్నదాన భవన నిర్మాణానికి విరాళం
NEWS Sep 16,2024 05:59 pm
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకం భవన నిర్మాణానికి భీమవరం మండలం తాడేరుకు చెందిన గంటా వెంకట్రావు మణి కుమారి దంపతులు సోమవారం రూ. 50,000 విరాళాన్ని అందజేసారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ ఈవో కిశోర్ కుమార్ స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.