ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
NEWS Sep 16,2024 05:58 pm
సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పట్టణంలోని బివైనగర్‌లో, MNJ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నామోగ్రామ్ విభాగాన్ని కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించగా, నోటి క్యాన్సర్ విభాగాన్ని నాగుల సత్యనారాయణ, చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, డిఎంహెచ్ఓ డా. వసంతరావు పాల్గొన్నారు.