అందుకే విమోచన దినోత్సవం: ఈటల
NEWS Sep 16,2024 05:03 pm
ఎంతోమంది యోధుల పోరాటంతో నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని, అందుకే బీజేపీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రేపు విమోచన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తోంని, తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజుగా భావించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరారు.