స్వచ్చతా హీ కార్యక్రమాన్ని
విజయవంతం చేయండి: సర్పంచ్
NEWS Sep 16,2024 05:15 pm
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచతా హీ కార్యక్రమం దిగ్విజయం చేయాలని ఆలమూరు మండలం గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు పిలుపు నిచ్చారు. సోమవారం పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.