హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చింది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చాయి. 10 రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది.