ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
NEWS Sep 16,2024 05:11 pm
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కొత్త దామరాజ్ పల్లి గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేణుగోపాల చారి మాట్లాడుతూ అన్ని కులవృత్తులకు విశ్వకర్మ గురువని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ మండల అధ్యక్షులు ఇల్లెందుల వేణుగోపాల చారి, స్థానిక నాయకులు, విశ్వకర్మ సంఘ సభ్యులు పాల్గొన్నారు.