నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు
NEWS Sep 16,2024 02:31 pm
హైదరాబాద్‌లో లక్ష గణపతులను రేపు నిమజ్జనం జరగుతుంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఉదయం ప్రారంభమవుతుంది. 700 మంది పోలీసులతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 3 రోజుల పాటు 15 వేల మంది GHMC సిబ్బంది, 3 షిప్టుల్లో పనిచేస్తారని, GHMC పరిధిలో 465 క్రేన్లు, హుస్సేన్‌సాగర్ వద్ద 38 క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. శోభాయాత్రలో కలర్ పేపర్లు, పూలు, చెత్త రోడ్లపై వేయవద్దని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ కోసం 9010203626, 8712660600, 040-27852482 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.