ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: CM
NEWS Sep 16,2024 05:23 pm
తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘రాజీవ్ గాంధీ లేకపోయుంటే, గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకుంటూ తిరిగెటోడివి. గుంటూరులో చదువుకున్న అని చెప్పినవ్ కదా. లేకపోతే, సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోడివి. నీకు కంప్యూటర్, ఐటీ జాబ్, ఐటీ మంత్రి పదవి వచ్చాయంటే.. అది రాజీవ్ గాంధీ ఘనతే’ అని రేవంత్ రెడ్డి అన్నారు.