జగదేవ్ పూర్ మండలం అలిరాజ్ పేట గ్రామానికి చెందిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు వ్యాపా వెంకటస్వామి (42) గుండెపోటుతో మృతి చెందాడు. గజ్వేల్ మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పనిచేస్తున్న వెంకటస్వామి జగదేవ్పూర్ బదిలీ అయ్యారు. శనివారం రాత్రి బాధ్యతలు స్వీకరించగా సోమవారం అలిరాజుపేట ఇంట్లో గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు లోక్ నేత్ర ట్రస్ట్ కు కళ్ళు దానం చేశారు. వెంకట స్వామి భార్య మంజుల జగదేవ్పూర్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.