MNCL: మంచిర్యాల పట్టణంలో మంగళవారం జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సీఐ బన్సీలాల్ ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. ఊరేగింపుల్లో డీజేకు అనుమతి లేదని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.