బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన సీఎంను కలిసి పుష్పగుచ్చంను అందజేశారు. అనంతరం ఆయనకు రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.