నిఘా నీడలో నిమజ్జన శోభాయాత్ర
NEWS Sep 16,2024 05:07 pm
మంచిర్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం లక్షెట్టిపేటలోని రాయపట్నం బ్రిడ్జి, మంచిర్యాలలో నిమజ్జన శోభాయాత్ర రూట్ ను డీసీపీ భాస్కర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. గణేష్ శోభాయాత్రకు 842 మందితో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశామని, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.