ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సెల్యులైటిస్ వ్యాధి వణికిస్తుంది. సెల్యులైటిస్ సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినప్పటికీ వ్యాధి తీవ్రత ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలంలో దోమకాటుతో మొదలయ్యే ఈ వ్యాధి.. దురదతో గాయాలుగా మారుతుంది. రక్తనాళాల్లోకి వ్యాధి వ్యాపిస్తే అవయవాలు తొలగించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. త్వరగా చికిత్స తీసుకుంటే మేలు అంటున్నారు. ఏటా పదుల సంఖ్యలో ఉండే ఈ వ్యాధి బాధితులు ఈసారి వందల్లో ఉన్నారు.