వందే భారత్ రైలుకు మంచిర్యాల
రైల్వేస్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని డిమాండ్
NEWS Sep 16,2024 02:33 pm
సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని రైల్వే స్టేషన్‌లో సోమవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సంఘీభావం తెలిపారు. వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇస్తే అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుందని, త్వరలో కేంద్ర రైల్వేమంత్రిని కలిసి రైలు ఆగేలా కృషి చేస్తానని తెలిపారు.