ఇద్దరు చిన్నారులపై కుక్కల దాడి
NEWS Sep 16,2024 02:39 pm
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు సోమవారం దాడి చేశాయి. గ్రామంలోని రెండవ వార్డులో పోతు రమేష్ కుమారుడు రాణా (9), బొమ్మిడి శశిధర్ కూతురు అధ్య శ్రీ (4) వారి ఇంటి ముందర ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కలు దాడి చేస్తున్న సమయంలో రానా తల్లి గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.