కువైట్లో జగిత్యాల వాసి మృతి
NEWS Sep 16,2024 05:10 pm
జగిత్యాల పట్టణంలోని 28 వార్డుకు చెందిన కొత్తకొండ సాయికృష్ణ గౌడ్ (37) గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. పదేళ్ల నుంచి గల్ఫ్ లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల క్రితమే ఇంటికి వచ్చిన సాయి తిరిగి కువైట్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తెలపడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.