జగిత్యాల జిల్లాలో రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోనే రుణమాఫీ సర్వేలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను మండల వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి చేపడుతున్నారు. కాగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని అధికారులు అంటున్నారు.