తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూడా తిరుపతికి కొత్తపల్లి గ్రామం మోయ తుమ్మెద వాగులో (ఎల్ఎండి మానేరు డ్యామ్)లో 28 కిలోల బొచ్చె చేప వలకు చిక్కింది. చేపల వేటలో భాగంగా సోమవారం మత్స్యకారులు వాగులో చేపలు పడుతున్న సందర్భంలో తిరుపతి అనే మత్స్యకారుడి వలలో భారీ చేప చిక్కింది. గణపతి నిమజ్జనం రోజున ఈ వాగులో ఇంత పెద్ద చేప తన వలకు చిక్కడం ఎంతో శుభ సూచకమని అతను ఆనందం వ్యక్తం చేశాడు.