తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గడిచిన 9 నెలల్లో తెలంగాణను 9 సంవత్సరాల వినాశనం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ ఉదయం ఒక మాట.. సాయంత్రం ఒక మాట మాట్లాడతారని ఓ వైద్యుడు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని పేర్కొన్నారు.