KNR: ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శోభయాత్ర ర్యాలీలో ట్రాక్టర్ను నడిపి సరదాగా గడిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.