కరీంనగర్: 70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని వృద్ధులు కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ ఈ బీమా వర్తించనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు రూ.2 లక్షల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.