గణేష్ ఊరేగింపుగా శోభాయాత్ర
NEWS Sep 16,2024 10:09 am
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో మహారాజా యూత్ ఆధ్వర్యంలో పిల్లలు ప్రతిష్టించిన గణపతికి మహిళలు, కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ పిల్లలు గణనాధునికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఉంచి భక్తి శ్రద్ధలతో యువకులు, మహిళలు ఉత్సాహంగా ఆటపాటల మధ్య తీన్మార్ స్టెప్పులతో ఊరేగింపుగా శోభాయాత్ర కొనసాగింది. అనంతరం తెల్లవారుజామున ఆందోలు పెద్ద చెరువు వద్దకు తరలించి అక్కడ ఆ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం చెరువులో గంగమ్మ ఒడిలోకి పంపించారు.