ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసిందని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేయాలని తెలిపారు.