ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్!
NEWS Sep 16,2024 09:21 am
ఏపీ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి రికార్డు సాధించింది. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించి, సర్టిఫికెట్‌ను, మెడల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ క్రాఫ్ట్ అందించారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.