గణేష్ నిమజ్జనం - భద్రతా ఏర్పాట్లు
NEWS Sep 16,2024 10:26 am
జగిత్యాల పట్టణంలోని స్థానిక BLN గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జ నానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవా ల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జనం ఉత్సవం సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. నిమజ్జనోత్సవానికి భద్రతపరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అయన తెలిపారు.