గణనాథుని శోభాయాత్రకు సిద్దం
NEWS Sep 16,2024 10:04 am
జిల్లాలో మంగళవారం గణేష్ నిమజ్జన శోభయాత్ర సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీసులతో ప్రత్యక్షంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పలు ప్రధాన కూడళ్లలో, ఇతర ప్రార్థన మందిరాలపై రంగులు (గులాల్) పడకుండా ఎతైన బారికెట్స్‌తో పాలిథిన్ కవర్లను ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదన్నారు. నిమజ్జనంలో పాల్గొనేవారు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించకుండా నిర్వహకులు జాగ్రత్తగా పడాలని కోరారు.