జగిత్యాలలో గణేషుడి మెడలోకి ఓ నాగు పాము వెళ్లింది. మండపంలోకి వచ్చిన నాగేంద్రుడు నేరుగా.. గణనాథుని మెడలో అలంకరణగా చేరాడు. వాణినగర్ త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ గణేష్ మండపంలో ఈ వింత జరిగింది. సోమవారం ఇది జరగడంతో శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడు (గణపతి) మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ పూజలు చేస్తున్నారు.