ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన వాలంటీర్లు!
NEWS Sep 16,2024 08:49 am
వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు YVB రాజేంద్రప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు వాలంటర్లు. రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60 లక్షల మంది వలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.