భక్తిశ్రద్ధలతో గణనాధులకు వీడుకోలు
NEWS Sep 16,2024 09:04 am
వినాయక నవరాత్రుల్లో భాగంగా 9 రోజులుగా వివిధ మండపాల్లో వెలసిన గౌరీ నందనుడు ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రుల్లో భాగంగా జోగిపేట పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో మహారాజా యూత్ ఆధ్వర్యంలో పిల్లలు ప్రతిష్టించిన గణపతికి మహిళలు, కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ పిల్లలు గణనాధునికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఉంచి భక్తిశ్రద్ధలతో యువకులు ఉత్సాహంగా ఆటపాటల మధ్య తీన్మార్ స్టెప్పులతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆందోలు పెద్ద చెరువు వద్ద పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.