మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖరామ్ చౌరస్తా అడ్డా కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన మల్లన్న మాట్లాడుతూ ఈనెల 18న ఛలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని కోరారు. భవన నిర్మాణం సంక్షేమ బోర్డు స్కీమ్ లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.