గరుడపక్షి వినాయకుడిపై గరుడపక్షి
NEWS Sep 16,2024 10:31 am
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భీముని దుబ్బలో ప్రతిష్టించిన గరుడపక్షి వినాయకుడి వద్దకు చిన్న గరుడపక్షి వచ్చి పాదాలవద్ద నైవేద్యం తిని, ఆ తర్వాత గణేషుడి చేతిపై వాలింది. అక్కడే ఉన్న భక్తులు గరుడ పక్షిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. గరుడపక్షి రూపంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్దకు గరుడ పక్షి రావడంతో స్థానికులు తండోపతండాలుగా వెళ్లి తిలకిస్తున్నారు.