జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
NEWS Sep 16,2024 07:23 am
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై వేధింపుల కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ లేడి కొరియాగ్రఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 376 అత్యాచార కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసు నమోదు చేశారు.