రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం
NEWS Sep 16,2024 07:11 am
ప్రభుత్వ శెలవు కారణంగా వాయిదా పడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్నట్ల కాకినాడ నగరపాలక సంస్ధ కమిషనర్ భావన తెలిపారు. మంగళవారం, కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఉదయం 9:30 నుంచి డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం, అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆమె ఓ ప్రకటనలో చెప్పారు.